ప్రతి పిల్లాడిని ప్రభుత్వ బడికి పంపాలని సర్పంచ్ పిలుపు..!

by Kodari Anjali |

సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ప్రతి పిల్లాడిని ప్రభుత్వ బడికి పంపాలని సర్పంచ్ పిలుపు..!
X

దిశ, సైదాపూర్: సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ మ్యాకల స్వప్న-సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో బడికి పంపి విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. విద్య అనేది సమాజ అభివృద్ధికి పునాది అని ఆమె పేర్కొన్నారు. ఉపాధ్యాయులు గ్రామంలో డ్రాప్‌అవుట్స్ లేకుండా చూడాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, ప్రభుత్వ పథకాల ద్వారా విద్యను అందరికీ చేరువ చేయాలని సూచించారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని, బడిబాట కార్యక్రమం ద్వారా విద్యపై అవగాహన పెంచారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పాఠశాల ప్రవేశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అందె రాకేష్, ఉపాధ్యాయులు అర్చన, మేఘన, అంగన్వాడీ కార్యకర్త అబ్బిడి స్వరాజ్యం, విద్యార్థులు, వార్డు సభ్యులు మొలుగూరి భారతి, మ్యాదరి రాధ, తలారి రాము, వడ్ల మమత, తలారి యాదగిరి, పెసరు లత, పెసరు అలేఖ్య, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story