- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరుగా ఓటీటీలోకి గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’
గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘మ్యాజిక్’ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మ్యాజిక్’ సినిమా విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ‘కింగ్డమ్’ సినిమా చిత్రీకరణ ఆలస్యమవడంతో గ్యాప్‌లో గౌతమ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మొదటగా ‘కింగ్డమ్’ కంటే ముందే ‘మ్యాజిక్’ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో ఈ మూవీ విడుదల కాలేదు. అనంతరం కూడా చిత్రానికి సంబంధించిన ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడంతో అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘మ్యాజిక్’ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమైతే, ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించడంతో ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ‘మ్యాజిక్’ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారా? లేక థియేటర్లలో రిలీజ్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.






