మోదీ చారిత్రక రికార్డుకు ప్రత్యేక పూజలు.. తార్నాకలో బీజేపీ సంబరాలు

by Kodari Anjali |

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించారు.

మోదీ చారిత్రక రికార్డుకు ప్రత్యేక పూజలు.. తార్నాకలో బీజేపీ సంబరాలు
X

దిశ, సికింద్రాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించారు. 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తార్నాకలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, దేశసేవలో మరింత శక్తి ప్రసాదించాలని పరమశివుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, మోదీ 4,399 రోజుల సేవా ప్రయాణం కేవలం పదవీకాల రికార్డు మాత్రమే కాదని, శక్తివంతమైన, సమృద్ధిశాలి, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఒక స్వర్ణిమ అధ్యాయమని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సేవ, సుశాసన్, గరీబ్ కల్యాణ్, వికసిత్ భారత్ సంకల్పాలతో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రధానమంత్రి ప్రజా జీవితంలోని ప్రతి రోజు 140 కోట్ల భారతీయుల సంక్షేమానికి అంకితమైందని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో తార్నాక బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story