ఇండస్ట్రీలో బాలయ్య ప్రత్యేకం.. అసలు విషయం చెప్పి ఎమోషనల్ అయిన ఉదయభాను

by Pulgam srinivas |

బాలయ్య గారికి ఒక్క మెసేజ్ పెట్టగానే వెంటనే ఫోన్ చేసి, పిల్లల పుట్టినరోజుకు తప్పకుండా వస్తానని మాట ఇచ్చారని ఉదయభాను తెలిపారు.

ఇండస్ట్రీలో బాలయ్య ప్రత్యేకం.. అసలు విషయం చెప్పి ఎమోషనల్ అయిన ఉదయభాను
X

దిశ, వెబ్ డెస్క్: ఈరోజు జూన్ 10వ తేదీ టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే యాంకర్ ఉదయభాను చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొంతకాలం క్రితం ఉదయభాను మాట్లాడుతూ.. “తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ వేరు.. బాలయ్య వేరు.

నేను 12 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా నాకు అసలు సమయం ఉండేది కాదు. పండుగలు, సరదాలు, సంతోషాలు అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. అలాంటి సమయంలోనే నేను గర్భం దాల్చాను. సహజంగానే మహిళలకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అలాంటి కోరికలు మరింత ఎక్కువగా ఉంటాయి. నాకు శ్రీమంతం చేసుకోవాలని ఎంతో కోరిక ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అది కుదరలేదు. అనంతరం నేను కవల పిల్లలకు జన్మనిచ్చాను. దాంతో ఎంతో ఆనందంగా ఉన్నాను.

ఆ సమయంలో నా పిల్లల మొదటి పుట్టినరోజును ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల మధ్య జరపాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా చాలా మందికి ఫోన్లు చేశాను. కానీ చాలామంది స్పందించలేదు. చివరకు బాలయ్య గారికి ఒక మెసేజ్ పెట్టాను. వెంటనే ఆయన నాకు ఫోన్ చేశారు. ‘కచ్చితంగా మీ పిల్లల పుట్టినరోజుకు వస్తాను’ అని మాట ఇచ్చారు. మాట తప్పకుండా కరెక్ట్ టైమ్‌కు పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోలేదు. దాదాపు 45 నిమిషాల పాటు మాతో గడిపారు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది” అంటూ బాలయ్య గురించి చెబుతూ ఉదయభాను ఎమోషనల్ అయ్యారు.

Next Story