ట్రోలింగ్ వచ్చినప్పటికీ తగ్గని జాన్వీ క్రేజ్.. హార్రర్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-10 06:38:24  IST  )

జాన్వీ కపూర్‌ ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్. ట్రోలింగ్ వచ్చినప్పటికీ అమ్మడు హార్రర్ మూవీలో నటించజేసేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రోలింగ్ వచ్చినప్పటికీ తగ్గని జాన్వీ క్రేజ్.. హార్రర్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ మూవీలో నటించింది. ఇక ఈ సినిమా జూన్ 4న విడుదలై బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు బ్రేక్ చేస్తోంది. కానీ జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆమెను ఇందులో ఓ గ్లామర్ బొమ్మగా మాత్రమే చూపించారని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న బుచ్చిబాబు సనా ఇప్పటికే క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించిన విషయం తెలిసిందే. ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతూ.. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతోంది. ఇక జాన్వీ కపూర్ ట్రోలింగ్‌పై ఇప్పటికే హీరోయిన్లు, సినీ స్టా్ర్స్ స్పందించి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక జాన్వీ తెలుగు ఇండస్ట్రీని వీడే సమయం ఆసన్నమైందని కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్‌ ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్. ట్రోలింగ్ వచ్చినప్పటికీ అమ్మడు హార్రర్ మూవీలో నటించజేసేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. కల్ట్ క్లాసిక్ హారర్ ఫాంటసీ చిత్రంగా గుర్తింపు పొందిన ‘తుంబాడ్’ దర్శకుడు రాహి అనిల్ బర్వే ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించేలా ఉండబోతోందని టాక్. ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీయో స్టూడియోస్ నిలవడంతో సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌పై జాన్వీ కపూర్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు టాక్. కేవలం నటించడం మాత్రమే కాకుండా పాత్ర కోసం పూర్తిస్థాయి సన్నాహాలు చేయాలని కూడా ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకోవాలనుకుంటుందట. ‘పెద్ది’లో గ్లామర్ రోల్‌లో మెరిసిన ఈ భామ ఇప్పుడు హార్రర్ సినిమాతో భయపెట్టేందుకు సిద్ధమవుతోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతూ చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

మెస్మరైజ్ చేసే అందాలతో ఆకట్టుకుంటున్న నభా నటేష్.. పలుచటి వస్త్రాల్లో హీట్ పెంచేసింది

Next Story