- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్మరైజ్ చేసే అందాలతో ఆకట్టుకుంటున్న నభా నటేష్.. పలుచటి వస్త్రాల్లో హీట్ పెంచేసింది
పింక్ చీరలో నభా నటేష్ మెస్మరైజింగ్ లుక్స్.. పిక్స్ వైరల్.

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా ‘నాగబంధం’ మరియు ‘స్వయంభు’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న నభాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలు మంచి విజయాలను సాధిస్తే, నభా నటేష్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోవడం పెద్ద విషయం కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది.
చీరకట్టులో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. సోషల్ మీడియాలో హీట్
అప్పుడప్పుడు తన స్టైలిష్ మరియు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా నభా నటేష్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో లైట్ పింక్ కలర్‌లో ఉన్న పలుచటి చీరను ధరించిన నభా, అందుకు మ్యాచ్ అయ్యే హెవీ గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
మెడలో అందమైన హారం, చెవులకు స్టైలిష్ ఇయర్‌రింగ్స్ ధరించి మరింత అందాన్ని తెచ్చుకుంది. అంతేకాకుండా జడలో పువ్వులు అలంకరించుకోవడమే కాకుండా చేతిలో ఓ గులాబీ పువ్వు పట్టుకుని చిరునవ్వుతో కెమెరాకు ఫోజులు ఇచ్చింది.
ముఖంపై అందంగా జారిపడిన కురులు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. మొత్తంగా ఈ ఫొటోల్లో నభా నటేష్ అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






