చీరకట్టులో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. సోషల్ మీడియాలో హీట్

by Pulgam srinivas |   (  Updated:2026-06-10 04:49:20  IST  )

భాగ్యశ్రీ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న తాజా పిక్స్.

చీరకట్టులో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. సోషల్ మీడియాలో హీట్
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, భాగ్యశ్రీకి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. దీంతో వరుసగా క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు భారీ విజయం మాత్రం ఇంకా దక్కలేదు.

ప్రస్తుతం అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీపై భాగ్యశ్రీ భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా తన అందాలతో అభిమానులను ఫిదా చేయడంలో ఈ యంగ్ బ్యూటీ ముందుంటుంది.

వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ టచ్‌తో కూడిన ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా భాగ్యశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో స్కై బ్లూ కలర్ చీరలో మెరిసిపోయిన భాగ్యశ్రీ, సిల్వర్ కలర్ బ్లౌజ్‌తో మరింత స్టైలిష్‌గా కనిపించింది.

మెడలో అందమైన హారం, చిన్న ఇయర్‌రింగ్స్ ధరించి, గాలికి వదిలేసిన కురులతో క్యూట్ స్మైల్ ఇస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఆమె చిరునవ్వు ఈ ఫొటోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఈ పిక్స్‌లో భాగ్యశ్రీ అందాలు మరింత హైలైట్ కావడంతో, ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: ఇంస్టాగ్రామ్

జాన్వీ కపూర్ పెద్ది ట్రోలింగ్‌పై అదా శర్మ షాకింగ్ రియాక్షన్.. హీరోయిన్లు జాగ్రత్త వహించాలంటూ కామెంట్స్

Next Story