జాన్వీ కపూర్ పెద్ది ట్రోలింగ్‌పై అదా శర్మ షాకింగ్ రియాక్షన్.. హీరోయిన్లు జాగ్రత్త వహించాలంటూ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-10 04:47:51  IST  )

నటీనటులు ప్రాజెక్ట్‌లను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అదా అభిప్రాయపడ్డారు. ఇది కేవలం హీరోయిన్లకు మాత్రమే కాదు, హీరోలు, దర్శకులు, రచయితలకు కూడా వర్తిస్తుందని చెప్పారు.

జాన్వీ కపూర్ పెద్ది ట్రోలింగ్‌పై అదా శర్మ షాకింగ్ రియాక్షన్.. హీరోయిన్లు జాగ్రత్త వహించాలంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసిన అదా శర్మ త్వరలో ‘గవర్నర్’ అనే పవర్‌ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను చిన్మయ్ మాండ్లేకర్ తెరకెక్కించారు. విపుల్ అమృతతాల్ షా సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించగా.. అమిత్ త్రివేది సంగీతం అందించారు. అయితే ఈ సినిమా 1990 నాటి భారత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతుంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ ఆర్బీఐ గవర్నర్‌గా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా రక్షించారనే యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అదా శర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఇటీవల రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై జరుగుతున్న ట్రోలింగ్, నటీనటుల బాధ్యతపై తన అభిప్రాయాలను చెప్పారు. ‘పెద్ది’ సినిమాలో మహిళలను అభ్యంతరకరంగా చూపించారనే విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సనా ఇప్పటికే క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించిన విషయం తెలిసిందే.

దీనిపై అదా శర్మ మాట్లాడుతూ, తాను ఆ మూవీలో నటించలేదని, ఇంకా ఆచిత్రం చూడలేదని చెప్పారు. అలాగే తాను ఇండస్ట్రీ నేపథ్యం లేని వ్యక్తిని కాబట్టి, సినిమా కుటుంబం నుంచి వచ్చిన వారి ప్రయాణం తనకంటే భిన్నంగా ఉంటుందని.. అందుకే ఆ వివాదంపై తాను కామెంట్ చేయడం సరైంది కాదని చాకచక్యంగా సమాధానం ఇచ్చారు. నటీనటులు ప్రాజెక్ట్‌లను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అదా అభిప్రాయపడ్డారు. ఇది కేవలం హీరోయిన్లకు మాత్రమే కాదు, హీరోలు, దర్శకులు, రచయితలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. మనం చేసే ఒక చిన్న తప్పుడు నిర్ణయం దేశంపై ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. మహిళలు నిజ జీవితంలో ఎంతో తెలివైన వారు, ధైర్యవంతులు, వినోదభరితమైన వారు అని.. కేవలం ఒకే రకమైన మూస పద్ధతిలో ఉండే పాత్రల కంటే, భిన్నమైన కోణాలు ఉన్న స్క్రిప్టులనే తాను ఇష్టపడతానని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నటిగా ఇది నాకు ఒక పెద్ద సవాల్.. ఇలాంటి పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టం: సంయుక్త మీనన్

Next Story