- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీరాజా నివాసానికి వెళ్లి నివాళులర్పించిన విజయ్, సూర్య
ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా మృతిపట్ల సీఎం విజయ్ సంతాపం ప్రకటించారు. విజయ్ నేరుగా భారతీరాజా నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించితన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా మృతిపట్ల సీఎం విజయ్ సంతాపం ప్రకటించారు. విజయ్ నేరుగా భారతీరాజా నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించితన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తమిళ స్టార్ హీరో సూర్య సైతం భారతీరాజా ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే భారతీరాజా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన తన సినిమాలతో తమిళనాట లెజండరీ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. నటుడిగానూ ఆయన పలు సినిమాలు చేశారు. కేవలం కోలీవుడ్ కే పరిమితం అవ్వకుండా తెలుగులో ఆరాధణ, సీతకోకచిలుక లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరరెక్కించారు. దీంతో తెలుగు చిత్రసీమ సైతం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు తెలుగు సినిమా ప్రముఖులు సైతం భారతీరాజా మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.






