- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘నా వెనుక CM రేవంత్ ఉన్నారు.. డబ్బులివ్వకపోతే హైడ్రాను పంపిస్తా’

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నా వెనుక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహా, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, జగ్గారెడ్డి ఉన్నారు. నేను అడిగినన్ని కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటిమీదికి హైడ్రాను పంపించి మొత్తం కూలగొట్టిస్తా’ అంటూ తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎంఏ ఫహీమ్ బెదిరింపులకు పాల్పడినట్టు అమీన్ పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి అమీన్ పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 10న లేఖ రాశారు. అయితే ఈ అంశం మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
‘ఒకవైపు హైడ్రా పేరుతో డబ్బులు అడిగినా, బెదిరింపులకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ అంటున్నారు.. మరోవైపు స్వయంగా రేవంత్ రెడ్డి అనుచరుడు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే మీ మీదకు హైడ్రా పంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ స్పందించారు. ఈ అంశంపై విచారణ చేపట్టి రెండు మూడు రోజుల్లో వాస్తవాలను వెల్లడిస్తామని ప్రకటించారు.
సీసీఎస్‌లో ఫహీమ్ ఫిర్యాదు..
తెలుగు స్క్రైబ్, హవక్ మీడియా హౌస్ ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్ పేజీల్లో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సీసీఎస్ ఏసీపీకి టీపీసీసీ నేత ఫహీమ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.