- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: అమెరికా నిర్ణయాలు సానుకూల దృక్పథంలో ఉండాలి.. యూఎస్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి
ఇటీవల అమెరికా పెంచిన రాయితీలు, వీసాలపై కఠిన నిబంధనలన్నీ ఆందోళన కలిగించాయాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకాంక్షించారు. అమెరికాలోని హడ్సన్ ఇన్ స్టిట్యూట్ కు (Hudson Institute) చెందిన వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లతో కూడిన16 మంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలోఈ ప్రతినిధి బృందం భారత్‍లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఈ బృందం (US delegation) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల అమెరికా పెంచిన రాయితీలు, వీసాలపై కఠిన నిబంధనలన్నీ ఆందోళన కలిగించాయన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు.






