- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Engineering fees: భారీగా పెరగనున్న ఇంజినీరింగ్‌లో ఫీజులు! ఫీజుల నిర్ధారణ నిబంధనలకు సవరణ
ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు నిబంధనలకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల (Engineering College Fees) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు నిబంధనలకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోధనా ప్రమాణాలు, నిబంధనలు అమలు ఆధారంగా ఫీజుల పెంపునకు అనుమతి ఇచ్చింది. నాణ్యమైన బోధన, ప్లేస్‌మెంట్లు, విద్యార్థుల హాజరు, పరిశోధనలకు ప్రోత్సాహం ఆధారంగా ఫీజుల పెంపునకు పచ్చ జెండా ఊపింది. ఆధార్ ఆధారిత చెల్లింపులు, నిబంధనల అమలు ఆధారంగా ఫీజుల పెంపునకు అవకాశం కల్పించింది. అయితే ఈ ఏడాది పాత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కమిటీ నివేదికకు సర్కారు ఓకే..
ఫీజులు పెంచాలని కొన్ని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా కాలేజీల ఫీజుల నిర్ధారణ కోసం సమర్పించిన ప్రతిపాదనలపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని టీఏఎఫ్ఆర్‌సీకీ (TAFRC) హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. వి.బాలకిష్టారెడ్డి, మెంబర్ సెక్రటరీగా ఆచార్య శ్రీరాం వెంకటేశ్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించి సిఫారసులు చేసింది. వీటి ఆధారంగా ఫీజు నిబంధనలకు సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.






