అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాల ధ్వంసం

by Kodari Anjali |   (  Updated:2023-04-14 07:47:47  IST  )

మండల కేంద్రంలోని తాటిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి దిగువ భాగంలో ఉన్న శిలాఫలకాలను నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాల ధ్వంసం
X

దిశ, మల్యాల; మండల కేంద్రంలోని తాటిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి దిగువ భాగంలో ఉన్న శిలాఫలకాలను నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై గ్రామ సర్పంచ్ బింగి జ్యోష్న వేణు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇట్టి ఘటనపై అంబేద్కర్ యువజన సంఘం గ్రామ మాజీ అధ్యక్షుడు సుంకపాక టైటెసు మాట్లాడుతూ... శిలాఫలకాలను ధ్వంసం చేయడం దురదృష్టకరమని అంబేద్కర్‌ను అవమానించేలా ఇట్టి చర్యకు పాల్పడ్డ దుండగులను గుర్తించి వాళ్లను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. తాను అందుబాటులో లేనని హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళుతుండగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని తను గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత అనుమానితుల పేర్లను పోలీసు వారికి వెల్లడిస్తానని టైటెస్ తెలిపారు

Next Story