విద్యావ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం సిద్దం.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో COL ఒప్పందం

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (BRAOU) కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌ (COL)తో ఇన్‌టిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (iDEA) స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

విద్యావ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం సిద్దం.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో COL ఒప్పందం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (BRAOU) కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌ (COL)తో ఇన్‌టిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (iDEA) స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా BRAOUను ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందంతో బోధన, అభ్యాసం, పరిశోధనా రంగాల్లో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు iDEA అత్యాధునిక డిజిటల్‌ హబ్‌గా పనిచేయనుంది. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్యను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని BRAOU ప్రతినిధులు తెలిపారు.

తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే కాక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని COL అధ్యక్షుడు & CEO పీటర్ స్కాట్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, BRAOU వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story