- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ నాలెడ్జ్ టవర్.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీ బడ్జెట్ : రూ.19,721 కోట్ల కేటాయింపు
రాష్ట్ర బడ్జెట్‌లో షెడ్యూల్డ్ కులాలకు రూ.11,784 కోట్లు, షెడ్యూల్డ్ తెగలకు రూ.7,935 కోట్లు కలిపి మొత్తం రూ.19,721 కోట్ల భారీ కేటాయింపులు చేసినట్లు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌లో షెడ్యూల్డ్ కులాలకు రూ.11,784 కోట్లు, షెడ్యూల్డ్ తెగలకు రూ.7,935 కోట్లు కలిపి మొత్తం రూ.19,721 కోట్ల భారీ కేటాయింపులు చేసినట్లు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఉద్యోగుల భద్రతకు, పెన్షనర్ల సంక్షేమానికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించామని వెల్లడించారు. 2026-27 బడ్జెట్ సమగ్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. దళిత సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి రూ.368 కోట్లతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, అంబేద్కర్ భవనాలు, విగ్రహాలు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. దివ్యాంగుల వివాహాలను ప్రోత్సహిస్తూ రూ.2 లక్షల నగదు అందిస్తున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రూపకల్పన చేసి రూ.4వేల కోట్లు ప్రతిపాదించడం, చేయూత పథకం కింద అర్హులైన వారికి 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ రూ.14,861 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. విద్య రంగంలో పబ్లిక్ స్కూల్స్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు రూ.500 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు. కొత్తగా అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టి, వారానికి మూడు రోజులు పాలు, మిగతా రోజులు రాగి జావ అందించేందుకు రూ.800 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అంబేద్కర్ నాలెడ్జ్ టవర్‌తో దళిత విద్యార్థుల కోరకు సివిల్స్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలకు అత్యున్నత స్థాయి కోచింగ్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.






