- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబటి రాంబాబు మరో కుమార్తె సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి అంబటి రాంబాబు మరో కుమార్తె మౌనిక సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఆదేశాల మేరకు గల్లా మాధవి పర్యవేక్షనలో పోలీసుల సహకారంతో అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు మరో కుమార్తె మౌనిక సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఆదేశాల మేరకు గల్లా మాధవి పర్యవేక్షనలో పోలీసుల సహకారంతో అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. పార్టీకి అతీతంగా దీనిని అందరూ ఖండిస్తుంటే గల్లా మాధవి మాత్రం దాడి అనంతరం ప్రెస్ మీట్ బెదిరించారని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా మాధవికి ఇంత అహంకారం పనికిరాదని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థల కంటే గల్లా మాధవి పవర్ ఫుల్ కాదన్నారు.
పెమ్మసాని చదువుకున్న వ్యక్తి అని, విదేశాల నుండి వచ్చారని భావించారని కానీ ఆయన ఇక్కడ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. రెబ్ బుక్ కు బయపడని అంబటి రాంబాబు.. లా అండ్ ఆర్డర్ పై గౌరవంతో క్షమాపణ చెప్పారన్నారు. 2వేల మంది చుట్టుముట్టి రాళ్లు రువ్వినా, కత్తులు దూస్తున్నా అంబటి రాంబాబు ఒక్కరే ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఎంతమంది చుట్టుముట్టినా ఇంటి గోడకు గుణపాలు దింపుతున్నా ధైర్యంగా ఇంట్లో కూర్చోడానికి కారణం వ్యవస్థపై ఆయనకు ఉన్న నమ్మకమే అని అన్నారు. కానీ ఆ వ్యవస్థలను ఈ రోజు నిర్వీర్యం చేసి ఇళ్లపైకి వచ్చి ఆడవాళ్ల మీద దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






