- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అల్వాల్ టిమ్స్
నగరంలో ఎక్కడికక్కడ నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో ఎక్కడికక్కడ నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు... సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కృత నిశ్చయంతో ఉంది. నగరంలో నిర్మిస్తున్న మూడు టిమ్స్ దవాఖానలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అల్వాల్, సనత్ నగర్, కొత్తపేటలో ఒక్కోటి వెయ్యి పడకల కెపాసిటీతో ఉండేలా ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో అల్వాల్ టిమ్స్ న్యూరోసైన్సెస్, సనత్ నగర్ టిమ్స్ కార్డియాక్ సైన్సెస్, కొత్తపేట టిమ్స్ గ్యాస్ట్రో సైన్సెస్ విభాగాల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేస్తోంది.
మార్చి చివరి నాటికి అల్వాల్...
అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ 12,14,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.1196 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి రెగ్యులర్ గా నిర్మాణ పురోగతిపై మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి నాణ్యతతో స్ట్రక్చరల్ వర్క్ పూర్తయిందని, 95శాతం బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్ పూర్తయిందని, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు 60శాతం, ఫ్లోరింగ్, పెయింటింగ్ వర్క్స్ 50శాతం మేర పూర్తయి వేగంగా పనులు జరుగుతున్నాయని ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తెలిపారు. మొత్తంగా టిమ్స్ అల్వాల్ పనులు 70 శాతం పూర్తయ్యాయని చెప్పారు. సోమవారం నాడు ఆయన అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీని పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులకు, నిర్మాణ సంస్థకు పలు కీలక ఆదేశాలు జారీచేశారు.
గడువు లోగా పూర్తి చేయాల్సిందే...
సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విధించిన గడువు అయిన 2026 మార్చి చివరి నాటికి అన్ని రకాల పనులు పూర్తయి, ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీని వికాస్ రాజ్ ఆదేశించారు. ఆరోగ్య శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని సూచించారు. రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్ చేస్తానని అందరూ అలెర్ట్ గా పనిచేస్తూ... ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషి చేయాలని అన్నారు.
- Tags
- Tims Hospitals






