- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా.. అధికార మైకంలోనే హరీష్ రావ్! జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
అధికారం పోయిన మైకం నుంచి హరీష్ రావు ఇంకా బయటకు రావడం లేదని, ఇంకా అదే భ్రమలో ఉన్నాడని.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: అధికారం పోయిన మైకం నుంచి హరీష్ రావు ఇంకా బయటకు రావడం లేదని, ఇంకా అదే భ్రమలో ఉన్నాడని.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి; మహబూబాబాద్ లో మంత్రి సీతక్క పర్యటిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు.
అలాగే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల పరిస్థితి గురించి సమీక్ష జరుపుతున్నారని, అందులో భాగంగానే హుజూర్ నగర్, సూర్యాపేట ప్రాంతాలలో పర్యటన చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు ఇది తగిన సమయం కాదని అన్నారు. వర్షాలు, వరదల కారణంగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయం కొరకు 2 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని జగ్గారెడ్డి అన్నారు.






