- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘యాట తల నరికినట్లు నరుకుతా’.. CM రేవంత్ ఎదుట రెచ్చిపోయిన అల్లు అర్జున్
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డుల(Telangana Gaddar Awards) ప్రదానోత్సవంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతోన్న గద్దర్ సినీ అవార్డుల(Telangana Gaddar Awards) ప్రదానోత్సవంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బెస్ట్ యాక్టర్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అంతేగాకుండా.. ఈ సందర్భంగా పుష్ప-2 సినిమాలోని డైలాగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్‌తో అల్లు అర్జున్ చెప్పారు. ‘ఆ బిడ్డ మీద ఒక్క గీత పడినా.. గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పారు. దీంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. కాగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో సినీ తారలు రావడంతో హైటెక్స్ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ, సుకుమార్, రాజమౌలి, నాగ్‌అశ్విన్ హాజరయ్యారు.






