Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్.. పోలీసుల విచారణ ప్రారంభం

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-24 06:11:58  IST  )

సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట (Stampede) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్.. పోలీసుల విచారణ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవలే బెయిల్‌ (Bail)పై బయటకు వచ్చారు. హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు చిక్కడపల్లి పోలీసులు (Chikkadpally Police) విచారణకు రావాలంటూ సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ (Allu Arjun) కాసేపటి క్రితం చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్నారు. ఏసీపీ రమేష్ (ACP Ramesh), సీఐ రాజు (CI Raju), అల్లు అర్జున్ అడ్వొకేట్ అశోక్‌ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. అయితే, తాజాగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఫుటేజ్ ఆధారంగానే ఇవాళ విచారణను మొదలు పెట్టినట్లుగా సమాచారం. మొత్తం 18 ప్రశ్నలతో కూడిన పేపర్‌ను ఏసీపీ రమేష్ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్‌కు అందజేశారు. ఆ ప్రశ్నల ఆధారంగా ఆయన స్టేట్‌మెంట్‌‌ను రికార్డ్ చేస్తున్నారు.

Next Story