Alleti Maheshwar Reddy: హామీలు నెరవేర్చలేక.. బీజేపీపై విమర్శలా.. సీఎంపై ఏలేటి ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-01 06:44:42  IST  )

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక బీజేపీ (BJP) పార్టీ, నాయకులపై సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు.

Alleti Maheshwar Reddy: హామీలు నెరవేర్చలేక.. బీజేపీపై విమర్శలా.. సీఎంపై ఏలేటి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక బీజేపీ (BJP) పార్టీ, నాయకులపై సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు.ఇవాళ ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేపడుతోన్న రెస్క్యూ ఆపరేషన్ (Recue Operation) పనులను పరిశీలించేందుకు ఆయన హైదరాబాద్ (Hyderabad) నుంచి దోమలపెంట (Domalapenta)కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)పై సీఎం రేవంత్ రెడ్డి చే (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదని అన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో ముందు ఆరు గ్యారెంటీలు (Six Guarantees), 420 హామీలు హామీలు ఇచ్చి.. బీజేపీ (BJP) విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పని చేయలేక పక్క వారిని నిందించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోనూ ఏ ఒక్క హమీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. తెలంగాణ (Telangana) సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తూనే ఉందని.. లక్షల కోట్లు నిధులు ఇచ్చిన మాపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) బురదజల్లేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా మాపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణలో రూ.6 లక్షల కోట్లపైగా అభివృద్ధి పనులు చేపట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో ప్రజలకు అన్ని విషయాలు తెలుసని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

కాగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశంలో సంచలన వ్యా్ఖ్యలు చేశారు. కిషన్‌ రెడ్డి(Kishan Reddy) మోడీ భజన చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం బిహార్‌, యూపీకి ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడంలేదని ఆరోపణలు గుప్పించారు. కేవలం కిషన్‌రెడ్డి వల్లే మెట్రో (Metro), మూసీ (Musi) సుందరీకరణ పనులు ఆగాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్‌ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు చెందని అంశాలను పెట్టకుండా మిగతా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రావడం లేదని.. రూపాయి కడితే 42 పైసలు మాత్రమే వస్తున్నాయంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

Next Story