- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహోన్నత వ్యక్తి ముక్కు సుబ్బారెడ్డి: అల్లం నారాయణ
పీపుల్స్ వార్ పార్టీ తొలితరం ఉద్యమనేత ముక్కు సుబ్బారెడ్డి మహోన్నత వ్యక్తి అని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పీపుల్స్ వార్ పార్టీ తొలితరం ఉద్యమనేత ముక్కు సుబ్బారెడ్డి మహోన్నత వ్యక్తి అని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ సోషల్ చేంజ్ ఆధ్వర్యంలో ముక్కు సుబ్బారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో అల్లం నారాయణ పాల్గొని సుబ్బారెడ్డితో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1985లో పార్టీ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సుబ్బారెడ్డి పోషించిన పాత్రను వివరించారు.
అధేవిధంగా ఆర్‌ఈసీ(నిట్)లో ఆయనతో పాటు కలిసి చదువుకున్న అతడి మిత్రుడు కంచన్ రావు, డాక్టర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆ కాలపు ఉద్యమ చరిత్రతో పాటు ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా వివరించారు. సుబ్బారెడ్డి జీవతం గురించి పీపుల్స్ వార్ ఉద్యమంలోని కీలక ఘట్టాలను వెల్లడించారు. అనంతరం ఫోరం ఫర్ సోషల్ చేంజ్ కార్యదర్శి సాంబమూర్తి ముగింపు ఉపన్యాసంతో సంస్మరణ సభ ముగిసింది.






