వీబీజీరామ్‌జి చట్టం అమలుపై ఫోకస్: తొలి సమావేశానికి సర్వం సిద్ధం

by Vemula.Srinu Prasad |

వీబీజీ రామ్ జి చట్టం-2025 అమలు ప్రభావం, అవకాశాలు, విధానపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు..

వీబీజీరామ్‌జి చట్టం అమలుపై ఫోకస్: తొలి సమావేశానికి సర్వం సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వీబీజీ రామ్ జి చట్టం-2025 అమలు ప్రభావం, అవకాశాలు, విధానపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి కమిటీ సభ్యులుగా పాల్గొననున్నారు. ఈ చట్టం అమలైతే గ్రామీణ ప్రాంతాలు, ఉపాధి అవకాశాలు, స్థానిక సంస్థలు, అభివృద్ధి కార్యక్రమాలపై పడే ప్రభావం గురించి చర్చించనున్నారు. వివిధ శాఖల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణపై సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకోనుంది.

Next Story