- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీపీవో పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. హాల్ టికెట్ సూచనలు, పరీక్ష వివరాలివిగో
జీపీవోల నియామక పరీక్షకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 25న నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్ట్ కు ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలందరికీ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీపీవోల నియామక పరీక్షకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 25న నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్ట్ కు ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలందరికీ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించారు. సీసీఎల్ఏ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ప్రశ్నాపత్రం డిస్క్రిప్టివ్ (వివరణాత్మక ప్రశ్నలతో) ఉంటుందని సీసీఎల్ఏ అధికారులు తెలిపారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలు చేసిన విధులు, బాధ్యతలకు సంబంధించిన అంశాలతో కూడిన ప్రశ్నలే ఉంటాయని చెప్పారు. అప్లయ్ చేసిన వారందరూ రెవెన్యూ శాఖలో పని చేసిన వారే కాబట్టి.. వారికి పరీక్ష రాయడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. కనీసం పంచనామా రాయగలిగే అర్హతలు ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని స్క్రీనింగ్ ద్వారా అంచనా వేయడానికేనని పరీక్ష నిర్వహిస్తున్నారని సమాచారం. పైగా పోస్టుల సంఖ్యలో దరఖాస్తుదారుల సంఖ్య సగమే ఉంది. ఈ క్రమంలో కొందరిని ఫెయిల్ చేసే అవకాశం కూడా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నెలాఖరు వరకు ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే నెల రెండో తేదీలోగా గ్రామ పాలనాధికారుల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
వంద మార్కుల పరీక్ష
రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రతి భాగంలో రెండు ఉప ప్రశ్నలుగా 5 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లో ఉన్న ప్రశ్నలకు ఇంగ్లీష్ లోనే, తెలుగులో ఉన్నవాటికి తెలుగులోనే సమాధానాలు ఇవ్వాలి. ఇతర అభ్యర్థులతో మాట్లాడటం, సందేహాలు అడగడం వంటివి నిషిద్ధం.
హాల్ టికెట్ పై సూచనలు
హాల్ టికెట్ పై అభ్యర్థి తన ఫొటోను సూచించిన ప్రదేశంలో అతికించాలి. పరీక్షా హాల్లో నామినల్ రోల్‌పై అతికించేందుకు మరో ఫొటోను తీసుకురావాలి. ఉదయం 10 గంటల తర్వాత ఎగ్జామ్ సెంటర్ లోకి ప్రవేశం ఉండదు. పరీక్ష ముగిసే వరకు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్లలేరు. పరీక్షా హాల్లోకి నీలం/నలుపు బాల్ పాయింట్ పెన్నులు, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలి. ఇతర వస్తువులు తీసుకురావొద్దని సూచనలు చేశారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్ టికెట్‌ను భద్రంగా ఉంచాల్సి ఉంటుంది.






