Delimitaion : డీలిమిటేషన్ పై అఖిలపక్ష భేటీ : భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |   (  Updated:2025-03-17 12:30:49  IST  )

డీలిమిటేషన్(Delimitaion) పై త్వరలోనే అఖిలపక్ష సమావేశం(All Party Meeting) నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు.

Delimitaion : డీలిమిటేషన్ పై అఖిలపక్ష భేటీ : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : డీలిమిటేషన్(Delimitaion) పై త్వరలోనే అఖిలపక్ష సమావేశం(All Party Meeting) నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. త్వరలో నిర్వహించబోయే అఖిలపక్ష భేటీకి హాజరు కావాల్సిందిగా భట్టి విక్రమార్క, జానారెడ్డి(Janareddy) వివిధ రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. కాగా ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో చర్చించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ లేఖలో వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన జరగబోయే డీలిమిటేషన్ తో తెలంగాణ(Telangana)కు అన్యాయం జరగనుందని, జరగబోయే నష్టాన్ని గురించి అన్ని పార్టీలతో చర్చించి, ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరుకావాలని లేఖలో కోరారు. సమావేశానికి సంబంధించిన తేదీని, వేదికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా ఇటీవల సౌత్ లో డీలిమిటేషన్ విధానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానం వలన నష్టపోతాయని.. డీలిమిటేషన్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. కొనసాగించాలి అనుకుంటే 1971 జనాభా ప్రాతిపదికన తీసుకోవాలని ఇటీవల తమిళనాడు కేంద్రానికి తీర్మానం పంపిన విషయం తెలిసిందే.

Next Story