రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-29 12:26:25  IST  )

రేపు ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ అవుతుంది. డిసెంబ‌ర్ 1 నుండి 19 వ‌ర‌కు పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
X

దిశ‌, వెబ్ డెస్క్: రేపు ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ అవుతుంది. డిసెంబ‌ర్ 1 నుండి 19 వ‌ర‌కు పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. శీతాకాల స‌మావేశంలో 10 కీల‌క బిల్లులను కేంద్రం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. దీంతో స‌మావేశాలు స‌జావుగా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌ని కేంద్రం విప‌క్ష పార్టీల‌ను కోర‌నుంది.

కేంద్రం ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బిల్లుల‌లో అణు ఇంధన బిల్లు, కార్పొరేట్ చట్ట సవరణ బిల్లు, సెక్యూరిటీ మార్కెట్ కోడ్ బిల్లు, జాతీయ రహదారుల సవరణ బిల్లుతో సహా మ‌రికొన్ని కీల‌క బిల్లులు ఉన్నాయి. మ‌రోవైపు పార్లమెంట్ శీతకాల సమావేశంలో SIR (ఓటర్ల సవరణ జాబితా), అదానీ అంశం, ఢిల్లీ పొల్యూషన్ సహా పలు కీలక అంశాలను విప‌క్షాలు లేవ‌నెత్త‌నున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుండి డిసెంబర్ 20 వరకు జరిగాయి. ఈ ఏడాది దాదాపు వారం రోజులు కుదించారు.

Next Story