- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మీ సేవా కేంద్రాలన్నీ కిటకిట.. ఆరు రోజుల్లో ఎన్ని రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయంటే..?
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుతో తెలంగాణలో మీ సేవా కేంద్రాలన్ని కిటకిటలాడుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో ‘మీ సేవా’ (Mee Seva) కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల(Ration Cards)కోసం ప్రజలు దరఖాస్తులు చేస్తున్నారు. ఆరు రోజుల క్రితం ఈ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల్లో లక్షలకు పైగా ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. శుక్రవారం కూడా మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governemnt) ఏర్పడిన తర్వాత తొలిసారి రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో రేషన్ కార్డుల అనుకున్నంత మేర ఇవ్వలేదనే విమర్శ ఉంది. అప్పట్లోనూ దరఖాస్తులు భారీగా వెల్లివెత్తినా పరిమితంగా రేషన్ కార్డులు మంజూరు చేశారు. దీంతో అప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రజలకు.. ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునివ్వడంతో గుడ్ న్యూస్ లభించినట్టైంది. దీంతో కుటుంబ సభ్యుల పేర్లతో నింపిన దరఖాస్తులను తీసుకుని మీ కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో అక్కడ రద్దీ కొనసాగుతోంది. పలుచోట్ల సాంకేతిక కారణాలతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. అయినా సరే పడిగాపులు కాసి మరీ కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేస్తున్నారు.
ఈ 7న సివిల్ సప్లై ఆదేశాలతో 8వ తేదీ నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులను మీ సేవా కేంద్రాలు స్వీకరిస్తున్నాయని, కేవలం ఆరు రోజుల్లోనే 1,01,200 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజా పాలనలో 40 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఆధార్ అప్ డేట్, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఉదయం 6 గంటల నుంచే మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అప్లికేషన్ తీసుకున్న తర్వాత కూడా గంటలతరబడి లైన్‌లో నిల్చువాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. ఒక్కో్ దరఖాస్తుకు రూ.45 తీసుకోవాల్సి ఉండగా రూ.150 వరకూ వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మీ సేవా కేంద్రాలపై అధికారులు నిఘా పెట్టారు. అధిక డబ్బులు వసూలు చేస్తున్న కేంద్రాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.






