- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులంతా లొంగిపోండి.. డీజీపీ శివధర్‌రెడ్డి కీలక పిలుపు
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా వెంటనే లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా వెంటనే లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నిజామాబాద్‌లో విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరమర్శించారు. అనంతరం సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలతో పాటు వివిధ కేడర్లు తమ ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు. ఇక తెలంగాణలో కూడా మావోయిస్టులు లొంగిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కానీ, రాష్ట్రంలో ఇంకా 65 మంది మావోయిస్టులు యాక్టివ్‌గానే ఉన్నారని.. వారంతా త్వరలోనే లొంగిపోతారని ఆశిస్తున్నామని అన్నారు. వారిపై ఎలాంటి కేసులు ఉన్నా తాము కొట్టేసేందుకు సిద్ధమని ఆఫర్ ఇచ్చారు. పోలీస్, రెవెన్యూ, మీడియా, ఇలా ఎవరి ఆధ్వర్యంలోనైనా మావోయిస్టులు ఆయుధాలతో సరెండర్ అవ్వొచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ వారిపై సానుభూతితోనే వ్యవహరిస్తామని, ఎలాంటి వేధింపులు ఉండబోవని డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు.






