- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay : హిందువులంతా ఒకేమాట మీద నిలబడాలి : ఏక్తా యాత్రలో బండి సంజయ్
కరీంనగర్‌లో నేడు జరిగిన హిందూ ఏక్తా యాత్ర(Hindu Ekta Yatra)లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) పాల్గొని ప్రసంగించారు.

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్‌లో నేడు జరిగిన హిందూ ఏక్తా యాత్ర(Hindu Ekta Yatra)లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) పాల్గొని ప్రసంగించారు. ఈ యాత్ర హిందువుల్లో భేదాలను తొలగించి అన్ని వర్గాల మధ్య సమానత్వం సాధించడానికి, దేశ బలోపేతానికి దోహదపడుతుందని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ(BJP) బలాన్ని, హిందూ ఐక్యత భావజాలాన్ని విస్తరించడానికి ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై విమర్శలు చేస్తూ.. వారి విధానాలు హిందూ సమాజాన్ని నాశనం చేస్తున్నాయని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులను కాంగ్రెస్ నిరోధించలేకపోయిందని ఆరోపించారు.
ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ(Asaduddhin Owaisi) హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఉగ్రవాదుల అడ్డాగా మార్చారని, వారికి హిందూ ఫోబియా ఉందని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్ల నిధులు తెచ్చినట్లు, సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ తీసుకొస్తున్నట్లు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా బండి సంజయ్ హామీ ఇచ్చారు.






