హరీశ్‍రావుకు అంత అహంకారం ఎందుకు?: మంత్రి ఉత్తమ్

by Prasad Jukanti |

ఇరిగేషన్‌లో తానే మాస్టర్ అని హరీశ్ రావు అనుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.

హరీశ్‍రావుకు  అంత అహంకారం ఎందుకు?: మంత్రి ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హరీశ్‍రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ లో తానే మాస్టర్ అని హరీశ్‍రావు (Harish Rao) అనుకుంటున్నారని ఆయనకు అంత అహంకారం ఎందుకు అని నిలదీశారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎవరి హయాంలో ఏం జరిగింతో అన్ని పత్రాలు బయటపెడాతామన్నారు. ఈ సందర్భంగా పాత జీవో కాపీలను మంత్రి మీడియాకు చూపించారు. కృష్ణా జలాల్లో మేము 90 టీఎంసీలు డిమాండ్ చేస్తే 45 టీఎంసీలు అడిగామని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. అబద్ధాల పునాదుల మీదే బీఆర్ఎస్ బతుకుతోందన్నారు. మేడిగడ్డ మరమ్మతులపై ఎల్ అండ్ టీ కి నోటీసులు ఇచ్చామని త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు.

Next Story