- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
అర్హులందరికీ పథకాలు అందేలా క్రియాశీలకంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ పరిధిలోని నేతలకు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అర్హులందరికీ పథకాలు అందేలా క్రియాశీలకంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ పరిధిలోని నేతలకు సూచించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్నగర కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని, కాంగ్రెస్ క్యాడర్ పెద్దఎత్తున పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వం 28వ తేదీన వచ్చేనెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విషయంలో కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ లు వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, పోటీ చేసిన అభ్యర్థులు, నగరంలోని వివిధ అనుబంధ సంఘాల ఛైర్మన్ లు పాల్గొన్నారు.






