దళిత, బహుజన వర్గాలంతా కాంగ్రెస్ వైపే ఉండాలి.. ఎంపీ మల్లు రవి

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ (Telangana Government) దూకుడుగా వెళ్తోంది.

దళిత, బహుజన వర్గాలంతా కాంగ్రెస్ వైపే ఉండాలి.. ఎంపీ మల్లు రవి
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ (Telangana Government) దూకుడుగా వెళ్తోంది. ఈ మేరకు శుక్రవారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ (BC Welfare Department) జీవోను విడుదల చేసింది. డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సు మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నెం.9ని విడుదల చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీ బంధు అంటూ కొనియాడారు. తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ రెడ్డి తూచా.. తప్పకుండా అమలు చేసి చూపిస్తున్నాడని కామెంట్ చేశారు.

కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ ఆప్తుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలోని మొట్ట మొదటిసారిగా సమగ్ర కులగణన (Cast Census) చేసి శాస్త్రీయ పద్ధతిలో విధానాన్ని రూపొందించి అన్ని రకాలుగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత రేవంత్‌దేనని కొనియాడారు. రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాలు అంత కాంగ్రెస్ వైపే ఉండాలని ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు.

Next Story