- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లుండి అన్ని కంపెనీలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే సంస్థలకు చర్యలు తప్పవు: ఈసీ హెచ్చరిక
రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13 న పోలింగ్ జరగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13 న పోలింగ్ జరగనుంది. కాగా ఎల్లుండి అన్ని కంపెనీలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై తప్పక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ప్రచారం సమయం ముగిశాక నియోజకవర్గాల్లో ఇతరులు ప్రచారాలు చేస్తూ కనిపించకూడదని తెలిపారు. కాగా జూన్ 1 వ తేదీ సాయంత్రం 6. 30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నామని పేర్కొన్నారు. పోలింగ్ సమయాల్లో 160 కేంద్ర బలగాలు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారని వెల్లడించారు. కాగా పోలింగ్ సమయంలో గుంపులుగా ఎక్కడ చర్చలు కొనసాగించొద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.
Read More..
Next Story






