- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్.. హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. రేపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. రేపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. పరేడ్ గ్రౌండ్ అలాగే గన్ పార్క్ లో రేపు ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.
రవీంద్ర భారతి వద్ద ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు, అలాగే నాంపల్లి నుంచి రవీంద్ర భారతి వైపు ట్రాఫిక్ ను అనుమతించబోమని ప్రకటించారు. దింతో AR పెట్రోల్ బంక్ వద్ద బషీర్బాగ్ బి జె ఆర్ విగ్రహం వైపు... వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్యాట్నీ సెంటర్ నుంచి తిరుమలగిరి వెళ్లే ట్రాఫిక్ కూడా వైఎంసిఏ, స్వీకార్- ఉపకార్ అలాగే టికెట్ వైపు చేయనున్నారు అధికారులు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇది ఇలా ఉండగా.. రేపటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 6.30 గంటలకు కౌన్సిల్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉ.7 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారు. ఉ.9.40 నిమిషాలకు సికింద్రాబాద్ పరేడ్స్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభం అవుతాయి. ఉ.9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు.






