- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందు బాబులకు BIG అలర్ట్.. బీర్ బాటిల్‌పై వేరే కంపెనీ మూత
వైన్ షాపులో కల్తీ బీర్లు కలకలం రేపింది. ఒక కంపెనీ బాటిల్‌కు మరో కంపెనీ మూత ఉండటంతో మందుబాబులు కంగుతిన్నారు .

దిశ, డైనమిక్ బ్యూరో: మండిపోతున్న ఎండలకు చల్లగా ఓ బీర్ తాగుదామనుకునే మద్యం ప్రియులకు కల్తీ మద్యం భయపెడుతోంది. ఒక బ్రాండ్ బీర్ బాటిల్ కు మరో బ్రాండ్ మూత ఉండటం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం కాజా గ్రామంలో ఉన్న వైన్స్ లో ఓ వ్యక్తి ఓ ప్రముఖ బ్రాండ్‍కు చెందిన బీర్‍ను కొనుగోలు చేశాడు. తీరా చూశాక ఈ తేడాను గమనించిన సదరు వ్యక్తి వెంటనే వైన్ షాప్ సిబ్బందిని నిలదీయడంతో తమకు స్టాక్ ఇలాగే వచ్చిందని చెప్పారు.
పని చేయని సీసీ కెమెరాలు:
సిబ్బంది సమాధానంతో సీసీ కెమెరాలు చూపించాలని కోరగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని బదులివ్వడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇలాంటి కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటే బాధ్యత ఎవరిదని మండిపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి కల్తీరాయుల పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






