తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి 3 రోజులు వర్షాలు

by velandi.Saikiran |

ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి 3 రోజులు వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట లాంటి జిల్లాలలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. మూడు రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Next Story