- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG-TET:టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇవాళే లాస్ట్ డేట్!
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల(నవంబర్) 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ తరుణంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ నేటి(నవబంర్ 29)తో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ అధికారిక వెబ్‌సైట్ లో ఇవాళ రాత్రి 11:50 గంటల లోగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల సవరణకు డిసెంబర్ 1 వరకు అవకాశం కల్పించారు.
అయితే.. ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేస్తుండటంతో గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది(2026) జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది(2025) తొలి విడత టెట్ నోటిఫికేషన్ గత జూన్‌లో విడుదల చేశారు. జులై 22న ఫలితాలు సైతం వెల్లడించారు. ఇక, తాజాగా రెండో విడత టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో అభ్యర్థులు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు.






