పది ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్: జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

by Kema Shiva Kumar |

పదో తరగతి ఫలితాలు విడుదలైన గంట కూడా గడవక మందే ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

పది ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్: జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదో తరగతి ఫలితాల అనంతరం ఫెయిల్ అయిన విద్యార్థులకు, మార్కులపై అసంతృప్తిగా ఉన్నవారికి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌తో పాటు రీకౌంటింగ్ (Recounting), రీవెరిఫికేషన్ (Re-verification) వివరాలను వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభమై జూన్ 12 వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసేందుకు ఈ గడువు ఉపయోగపడనుంది. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఫీజు చెల్లింపులు ఇలా..

సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు పరీక్షా ఫీజును చెల్లించవచ్చు. సకాలంలో ఫీజు చెల్లించి విద్యార్థులు తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఫలితాల్లో మార్కులపై ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్ ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.వెయ్యిగా నిర్ణయించారు.

Next Story