- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు అలర్ట్... మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు!
మే మొదటి వారంలోనే తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు రిలీజ్ అవుతాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఈ పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాల అప్డేట్ వచ్చేసింది. నిన్న తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ముగియగా, ఈ ఫలితాలను రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. మే మొదటి వారంలోనే ఈ ఫలితాలు వస్తాయని ప్రాథమిక సమాచారం అందుతోంది. పరీక్షలు కొనసాగుతుండగానే సమాంతరంగా పదో తరగతి ఆన్సర్ సీట్ల వాల్యుయేషన్ నిర్వహించారు.
ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనం పూర్తయినట్లు సమాచారం అందుతోంది. ఇక సైన్స్, సోషల్ వాల్యుయేషన్ తో పాటు స్కానింగ్ ప్రక్రియ మిగిలి ఉంది. ఈ తతంగం మొత్తం ఈ నెల 25వ తేదీ లోపు పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన మే మొదటి వారంలోనే తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు రిలీజ్ అవుతాయి. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.






