TG EAPCET-2025:విద్యార్థులకు అలర్ట్.. రేపే ఫలితాలు విడుదల

by Jakkula Mamatha |
TG EAPCET-2025:విద్యార్థులకు అలర్ట్.. రేపే ఫలితాలు విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈఏపీసెట్‌ (TG EAPCET-2025) ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులకు మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రేపు(మే 11) ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రేపు(ఆదివారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కులు జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈఏపీసెట్‌ ఫలితాలతో పాటు కౌన్సిలింగ్‌ తేదీలను కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ ని సందర్శించండి. విద్యార్థులు ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.



Next Story

Most Viewed