జర్నలిస్టులకు అలర్ట్.. కొత్త బస్‍పాస్‍లపై కీలక అప్‍డేట్

by Prasad Jukanti |   (  Updated:2026-06-11 09:18:11  IST  )

రాష్ట్ర, జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త బస్ పాసులు ఇవ్వాలంటూ ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఆర్టీసీకి లేఖ రాశారు.

జర్నలిస్టులకు అలర్ట్.. కొత్త బస్‍పాస్‍లపై కీలక అప్‍డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026-2028 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో అర్హులైన రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు రాయితీ బస్ పాస్‍లు జారీ చేయాలని ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ జి.ముకుంద రెడ్డి బుధవారం టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారిక లేఖ రాశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కొత్తగా అక్రిడిటేషన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ కాలానికి అనుగుణంగా 2026-2028 వ్యాలిటీడితో బస్‍పాస్‍లు ఇవ్వాలని లేఖ కోరారు. ప్రస్తుత బస్‌ పాస్‌ల గడువు ఈ నెల16తో ముగియనున్న నేపథ్యంలో 17.06.2026 నుండి 30.04.2028 వరకు వ్యాలిటీడీతో ఆన్ లైన్‍లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కొత్త అక్రిడిటేషన్లపై సైతం ముకుంద రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశామని మిగిలిన కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.




Next Story