ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. ‘ఈహెచ్ఎస్’ పై కీలక అప్ డేట్

by Prasad Jukanti |

తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ వైద్యం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటుపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. ‘ఈహెచ్ఎస్’ పై కీలక అప్ డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య సేవలే లక్ష్యంగా ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ (EHS) అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ స్కీమ్ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఎంప్లాయి హెల్త్ కేర్​ ట్రస్ట్ ద్వారా అమలు కానున్న ఈ పథకానికి ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా నియమించబోతోంది ప్రభుత్వం. . రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్ కు సీఈవోగా నియమించనున్నారు. ఈ మేరకు ఈ కమిటీని రేపు ప్రకటించే అవకాశముంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలుకాగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్​ జారీ చేసింది. మే 31లోపు డేటా అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Next Story