- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ANM అభ్యర్థులకు అలర్ట్.. ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్
తెలంగాణలో 1,931 ఏఎన్‌ఎం పోస్టుల ప్రాథమిక ఎంపిక జాబితాను MHSRB విడుదల చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలగాణ వైద్యారోగ్య శాఖలోని ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం వేగం పెంచింది. మొన్న నర్సింగ్ ఆఫీసర్ల నియామక పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇవాళ ఏఎన్ఎం పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలో 1,931 పోస్టుల భర్తీ కోసం ప్రాథమిక ఎంపిక జాబితాను (Provisional Selection List)ను తెలంగణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్‍బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అభ్యంతరాల స్వీకరణ షెడ్యూల్‌ను సైతం అధికారులు ప్రకటించారు. 1,931 పోస్టు భర్తీకోసం నోటిఫికేషన్ వెలువడగా 24,268 మంది దరఖాస్తు చేసుకున్నారు. 20,600 మంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రాయగా ఇందులో నుంచి ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేశారు.
అభ్యంతరాల స్వీకరణ:
ఎంపిక జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని బోర్డు పేర్కొంది. మే 18 నుండి మే 22 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలకు అవకాశం ఉంటుందని తెలిపింది. అభ్యంతరాలను కేవలం ఒక్కసారి మాత్రమే సమర్పించే అవకాశం ఉంటుందని సంబంధిత ధ్రువపత్రాలన్నింటినీ కలిపి ఒకే PDF ఫైల్‌గా అప్‌లోడ్ చేయాలని బోర్డు సూచించింది.
హైకోర్టు ఆదేశాలతో వెయిటేజీలో మార్పు:
హైకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సేవల వెయిటేజీ మార్కులను గతంలో ఉన్న 30 మార్కుల నుండి 20 మార్కులకు తగ్గించినట్లు స్పష్టం చేసింది. అభ్యర్థులు సాధించిన CBT స్కోరు మరియు ఈ సవరించిన వెయిటేజీ మార్కులను కలిపి బోర్డు ఈ ప్రొవిజనల్ జాబితాను సిద్ధం చేసిట్లు తెలిపింది. మొత్తం 1,931 పోస్టులలో 1,666 ఖాళీలు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉండగా, మిగిలిన 265 పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియ మొత్తం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పులకు లోబడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.






