ALERT : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాఠశాల సమయం మార్పు

by Sathputhe Rajesh |   (  Updated:2024-07-20 08:58:04  IST  )

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సమయంలో మార్పులు చేపట్టింది.

ALERT : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాఠశాల సమయం మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సమయంలో మార్పులు చేపట్టింది. హైస్కూల్ వేళలను ప్రాథమిక పాఠశాలలతో సమానం చేయడానికి గాను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు ఉన్న బడి వేళలను ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేసేలా మార్చాలని నిర్ణయించింది. కాగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల సమయాన్ని మార్చింది. కొత్త మారిన పాఠశాల వేళలను విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని విద్యా శాఖ సూచించింది.

Next Story