దక్షిణాదిలో 'మద్యం' పరుగులు.. లిక్కర్ వినియోగంలో తెలంగాణ టాప్

by Malleboina Mahesh |

దక్షిణ భారతదేశంలో మద్యం వినియోగం, దాని ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మద్యం ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

దక్షిణాదిలో మద్యం పరుగులు.. లిక్కర్ వినియోగంలో తెలంగాణ టాప్
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ భారతదేశంలో మద్యం వినియోగం, దాని ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మద్యం ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP), ఎక్సైజ్ శాఖ నివేదికల ప్రకారం, తెలంగాణలో ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా నమోదైంది. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక (4.25 లీటర్లు), తమిళనాడు (3.38 లీటర్లు) ఉండగా, ఆంధ్రప్రదేశ్ (2.71 లీటర్లు), కేరళ (2.53 లీటర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉండటం, అందులోనూ బీర్ల వాడకం రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం.

మద్యం కోసం ప్రజలు వెచ్చిస్తున్న సొమ్ము విషయంలో కూడా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు ఏడాదికి సగటున రూ. 11,351 మద్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఖర్చు కేవలం రూ. 6,399 గా మాత్రమే ఉంది. ఈ విక్రయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా రూ. 36,000 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరుతుందని అంచనా. అయితే, పెరుగుతున్న ఈ వ్యసనం వల్ల ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో గత కొంతకాలంగా మారుతున్న మద్యం విధానాల వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వినియోగం గణనీయంగా తక్కువగా ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Next Story