- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ స్కూళ్లలో ‘అక్షయ పాత్ర’
మధ్యాహ్నం భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మధ్యాహ్నం భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ప్రముఖ స్వచ్చంద సంస్థ 'అక్షయపాత్ర ఫౌండేషన్' ముందుకు వచ్చింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వీలుగా నవంబర్ 14న కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి రావాలని ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు.
ఎన్కేపల్లిలో అత్యాధునిక కిచెన్
మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేసే లక్ష్యంతో, కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌ను నిర్మించనుంది. ఈ కేంద్రం నుంచి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు భోజనం సరఫరా కానుంది. కొడంగల్ నియోజక వర్గంలో అల్పాహారం అందిస్తున్నప్పటి నుంచి విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
నాణ్యతకు పెద్దపీట..
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున చెల్లిస్తోంది. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన భోజనాన్ని తయారు చేసి అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ దాదాపు రూ. 25 వరకు ఖర్చు పెట్టనుంది. ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును (ఒక్కో విద్యార్థికి సుమారు రూ.18) అక్షయపాత్ర ఫౌండేషన్ స్వయంగా భరించనుంది. కార్పొరే ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల సహాయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బ్రేక్‌ఫాస్ట్ పథకం స్ఫూర్తితో..
గతేడాది డిసెంబర్ నుంచే కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం కింద 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు అల్పాహారం అందిస్తున్నారు. ఈ ప థకం దేశంలోనే అందరికీ ఆద ర్శంగా నిలుస్తుండగా, అదే స్ఫూర్తితో ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చే సేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ సిద్ధమైంది.






