అక్కినేని అఖిల్, జైనాబ్‌కు శుభాకాంక్షలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-06 05:54:31  IST  )

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నాగార్జున నివాసంలో ఘనంగా అక్కినేని అఖిల్ వివాహం జరిగింది...

అక్కినేని అఖిల్, జైనాబ్‌కు శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు అక్కినేని అఖిల్(Akkineni Akhil) వివాహం ఘనంగా జరిగింది. ఈ తెల్లవారుజామున మూడు గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాగార్జున(Nagarjuna) నివాసంలో అఖిల్, జైనాబ్ రవ్దీల పెళ్లి జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అఖిల్, జైనాబ్ ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి మెగా, దగ్గుబాటి హీరోలతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో హీరో నాగ చైతన్య హుషారుగా పాల్గొన్నారు. చైతూ భార్య శోభితా చీరకట్టులో మెరిశారు. నిన్నటి వరకూ బ్యాచులర్‌గా ఉన్న అఖిల్... నేటితో వివాహబంధంలోకి అడుపెట్టారు. దీంతో ఆయనకు, భార్య జైనాబ్‌కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story