- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేర్వేరు పార్టీల్లో ఉన్నా మేమంతా ఒక్కటే.. తెలంగాణలో అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
వేర్వేరు పార్టీల్లో ఉన్నా మేమంతా ఒక్కటే.. తెలంగాణలో అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అత్యంత గ్రాండ్‌గా సదర్ సమ్మేళనం(Sadar Sammelan) నిర్వహించారు. ఈ ఉత్సవానికి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేర్వేరు పార్టీల్లో ఉన్నా మనమంతా ఒక్కటే అని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ కలుసుకున్నామని చెప్పారు. సదర్ సమ్మేళనానికి మరింత గొప్పగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. యూపీలో బీజేపీని వెనక్కి నెడుతున్నామని అన్నారు. ఏపీ సపోర్ట్ లేకపోతే అసలు కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేది కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో మళ్లీ జెండా పాతుతామని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, అఖిలేష్ యాదవ్ ఈరోజు రాత్రికి హోటల్ తాజ్ కృష్ణలో బస చేయనున్నారు. రేపు ప్రైవేటు మీటింగ్‌లో పాల్గొని సాయంత్రం నాలుగు గంటలకు యూపీకి తిరుగు ప్రయాణం అవుతారు. అఖిలేష్ యాదవ్ పర్యటనకు సంబంధించి నగరంలో యాదవ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.






