- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ‘అఖండ-2’ టికెట్ ధరలు పెంపు.. కానీ ఓ కండిషన్
తెలంగాణలో ‘అఖండ-2’ టికెట్ ధరలు పెంపు.. కానీ ఓ కండిషన్

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో వస్తోన్న అఖండ-2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) శుభవార్త చెప్పింది. తెలంగాణలో అఖండ-2 సినిమా(Akhanda 2 Movie)కు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 8 గంటల షోకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ రేట్ రూ.600 వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసిది. విడుదలైన రోజు నుండి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ రేట్ల నుండి 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ప్రకారం 20 శాతం అఖండ-2 నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇచ్చారా లేదా అనేది తేలాల్సి ఉంది.
కాగా, ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తుండగా, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహన్ సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగాన్ని మించిన విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.






