యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ సేమ్: అక్బరుద్దీన్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ సేమ్: అక్బరుద్దీన్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ సేమ్. యూపీలో బుల్డోజర్‌తో ముస్లింల మసీదులు, దర్గాలు కూల్చితే.. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని హాట్ కామెంట్స్ చేశారు. పేదల ఇళ్లు, ముస్లింల ఇళ్లు, మసీలు అన్నీ హైడ్రాతో కూల్చేయిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ప్రస్తావన వస్తే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా అందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లే అన్నారు. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని క్షమించి మద్దతిచ్చామని తెలిపారు. దేశంలో మత ఘర్షణలకు కారణం కాంగ్రెసే అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రుల దగ్గరికి మేము వెళ్లం, ముఖ్యమంత్రులే మా దగ్గరికి వస్తారని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా? అని ప్రశ్నించారు. రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అని అక్బర్ చెప్పారు.

Next Story